సలాడ్స్ కోసం తరిగిన కూరగాయ ముక్కల్ని, పండ్ల ముక్కల్ని కొంచం సేపు విడిగా ఉంచిన అవి రంగు మారిపోతాయి. అలాగని సరిగ్గా తినే ముందరే కోయాలంటే టైమ్ సరిపోదు. కొన్ని సార్లు ఇంటికెవరైనా అతిధులు వస్తున్నారంటే ఇలాంటివి కాస్త తీరికగా అందంగా కట్ చేసి పెట్టుకుంటే హడావుడి లేకుండా వుంటుంది. అనిపిస్తుంది అలాంటప్పుడు ‘కోల్డ్ బౌల్ ఆన్ ఐస్’ వుంటే ఎంతో ఉపయోగ పడుతుంది. గంటా రెండు గంటల పాటు సలాడ్లు, పండ్ల ముక్కలు, అప్పుడే కోసిన వాటిలా తాజాగా వుంటాయి. గట్టి ప్లాస్టిక్ తో చేసిన ఈ బాక్స్ లకు కింద భాగంలో విడిగా తీసి పెట్టుకునే ఇంకో ఆర వుంటుంది. అందులో నిండా ఐస్ ముక్కలు పేర్చి పై భాగంలో పండ్ల ముక్కలు పెడితే ఐస్ చల్లదానం పై వరకు వ్యాపించి గిన్నెలోని ముక్కల్ని ఎక్కువ సేపు తాజాగా ఉంచుతుంది. దీనిలో వుండే ప్లాస్టిక్ సపరేటర్ తీసి ఒకే దాన్లో రెండు మూడు రకాల ముక్కలను అందంగా పేర్చి టేబుల్ పైన పెట్టేస్తే చూసేందుకు ఎంతో బాగుంటుంది.

Leave a comment