చర్మం,శిరోజాల ఆరోగ్యానికి అలొవెరా మంచిదని అధ్యాయనాలు నిరుపించాయి.వట్టి అలోవెరా గుజ్జు మాయిశ్చ రయిజర్ గా క్రీమ్ గా సహజమైన క్లెన్సర్ గా స్క్రబ్ గా పని చేస్తుంది. ఈ చలికాలంలో అలొవెరా చర్మ రక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అరస్పూన్ అలొవెరా గుజ్జులో ఆలివ్ నూనె,ఓట్ మిల్ కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి మాస్క్ వేసి ఓ పావుగంట సేపు ఆరనిచ్చి కడిగేస్తే మృతకణాలు పోతాయి. అలోవేరా గుజ్జులో నిమ్మరసం కలిపి మొహం పై నెమ్మదిగా మర్ధనా చేస్తే చర్మం కాంతివమ్తంగా తయారవుతుంది. కలబందగుజ్జు కలిపిన ప్యాక వేసి ఓ అరగంట తర్వాత గోరు వెచ్చని నీళ్ళలో కడిగితే పొడిబారిన చర్మం మృదువుగా అయిపోతుంది.

Leave a comment