ఈ వర్షాల్లోనే చింత చిగురు దొరికేది. సీజన్ లోనే వస్తుంది కనుక సాధ్యమైనంత ఎక్కువగా వాడుకోవాలి. పీచు ఎంతో అధికంగా ఉంటుంది చింతచిగురులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచటంలో చింత చిగురు సాయపడుతుంది. చింత చిగురు వేసి కాచిన నీటితో పుక్కిలిస్తే గొంతు నొప్పి,వాపు,మంట నోటి పూతలు తగ్గుతాయి. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా ఉంచుతుంది.థైరాయిడ్ ,డయాబెటిక్ ఉంటే ఇది ఔషధంలాగే పనికి వస్తుంది.శరీరంలోని వ్యర్ధాలను వెలికి తీసి పంప గలుగుతుంది. చింతచిగురు పప్పు,పొడి,పచ్చడి అన్ని రుచుగా ఉండేవే.

Leave a comment