ప్రముఖ టెన్నిస్ ఆటగాడు రోజర్ ఫెదరర్ ప్రారంభించిన స్విట్జర్లాండ్ లోని అతి పెద్ద చాక్లెట్ మ్యూజియం లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ మ్యూజియం పేరు ‘లిండ్ హోమ్ అఫ్ చాక్లెట్ ‘. ఇక్కడ చాక్లెట్ తయారీ చరిత్ర గురించి మొత్తం చరిత్రే చూడచ్చు. స్విట్జర్లాండ్ లోని జ్యురిచ్ లో ఉన్న మ్యూజియం లో 30 అడుగుల చాక్లెట్ ఫౌంటిన్ లో నిరంతరం చాక్లెట్ ప్రవహిస్తూ ఉంటుంది. 65 వేల అడుగుల వైశాల్యం లో ఉన్న ఈ మ్యూజియం లో ఒక ‘చాక్లెటేరియా’ కూడా ఉంది. రాకరాకల చాక్లెట్ ల తయారీ చూడవచ్చు. దీన్ని రూపొందించేందుకు ఏడు సంవత్సరాలు పట్టిందట.

Leave a comment