చూపు లేక పోతే నేం

గుజరాత్ లోని మేమ్ నగర్ లో అంధకన్యా ప్రకాశ్‌ గృహంలో అంధులైన అమ్మాయి ఈ సంవత్పరం దీపావళి కోసం ప్రతి ఇల్లు వెలిగేలా అద్భుతమైన కాన్సెప్ట్ రూపొందించారు. దీపావళి విక్రయాల కోసం లక్ష70వేల దీపాలు తయారు చేశారు. వాళ్ళు ఎప్పటికీ వెలుగు చూడలేదు,కానీ ఈ లోకానికి వెలుగులు పంచాలని వారు చేసిన ప్రయత్నం ఎంతో గొప్పగా ఉంది. వీళ్ళు ఈ దీపాల కోసం నిర్ణయించిన ధర చాలా తక్కువే .కానీ వీళ్ళు ఇచ్చిన స్ఫూర్తి మాత్రం ఈ దీపాలకు ఎంతో వెల పలుకుతోంది.