వంట ఇంటి పని త్వరగా పూర్తి చేసుకోవాలంటే చేసే పని లో కొంత నైపుణ్యం అలవర్చుకోవాలి. వంట సమయంలో ఎన్నో వస్తువులు చిన్నగా కోయటం పలుచగా తరగటం పైపొట్టు తొందరగా తీయటం వంటి చాలా పనులు ఉంటాయి. కొన్ని రకాల చాకులు వాడటం అలవాటు చేసుకోవాలి ఆనియన్ చాపర్,మటన్ కట్టర్ ఇలా ఒక పనికి ఒక రకం చాపర్ లు దొరుకుతాయి. ఇవన్నీ అందుబాటులో ఉంటే వేగంగా పెద్ద మొత్తంలో వంట చేసేందుకు ఉపయోగ పడతాయి. పనికి వచ్చే అనేక రకాల దినుసులు వివిధ పరిమాణంలో ఉండే ఆర్గనైజర్ బాక్స్ ల్లో చేతికి అందేలా అమర్చుకుంటే సులువుగా వంట పని ముగించవచ్చు. వంటగది సర్ధే సమయంలో వంట కు ఉపయోగపడే అన్ని వస్తువులు చేతికందే చోట పెట్టుకోవాలి.

Leave a comment