మా సొంత ఊరు ఎం కె పురం అక్కడే మిల్లెట్ బ్యాంక్ కు శ్రీకారం చుట్టాను రైతులు కళాకారులు విద్యార్థులు ఎన్జీవోలు వ్యవసాయ నిపుణులు అందరినీ ఇన్ వాల్వ్ చేశాను.నిపుణులు సాయంతో రసాయనాలు వాడని ఆర్గానిక్ మెన్యూర్  తయారీ ఇక్కడ నేర్చుకోవచ్చు.మిల్లెట్స్ పండిస్తే పోషకాహారలోపం తీరు తోందని నిపుణులు చెపుతూనే ఉన్నారు.రైతులకు తృణధాన్యాల సాగు దిశగా మలిస్తే బావుంటుందని మిల్లెట్ బ్యాంక్ కు శ్రీకారం చుట్టాను అంటోంది చిత్తూరు జిల్లా ఎం కె పురానికి చెందిన విశాల రెడ్డి ఇప్పుడామె ఎమ్ కె పురం లో 25 ఎకరాల్లో తృణ ధాన్యాల సాగు కు శ్రీకారం చుట్టింది ఐడెంటిటీ పేరుతో సంస్థని ప్రారంభించి డెస్టినేషన్ మార్కెటింగ్  విధానానికి శ్రీకారం చుట్టారు అలాగే యువ పారిశ్రామికవేత్తలకు మార్గ నిర్దేశ్యం చేస్తున్నారు విశాల రెడ్డి. పోషకాహార లోపం తీర్చే మిల్లెట్స్ పండించే పనిలో ఉన్నారా ఆమె.

Leave a comment