దారుణ ఘోరానికి ప్రత్యక్ష సాక్షి

అనుకొకుండా మనతో ప్రమేయం లేకుండానే ఎన్నో జరుగుతాయి. అలాగే ముంబై దాడులకు ప్రత్యక్ష సాక్షి ఆరు సంవత్సరాల దేవిక . ముంభై ఛత్రపతి శివాజీ టెర్మినల్ లో అమాయకులను పొట్టన పెట్టుకున్న లష్కరే ఉగ్రవాది కసబ్ ను గుర్తు పట్టిన ప్రత్యక్ష సాక్షి ఆరేళ్ళ దేవిక పూణే లో ఉన్న తన చిన్ననాయనను చూసేందుకు తండ్రి పెద్దన్నతో కలసి ముంబై వచ్చింది. ఆ రైల్వే స్టెషన్ లోనే కాల్పులు జరుపుతున్న కబస్ ను చూసింది.కోర్టులో నిన్నేవరు కాల్చారు అని అడిగితే సూటిగా కసబ్ ను చూపెట్టింది ఆమె. దేశం మొత్తం ఆ చిన్నారి ధైర్యానికి మొచ్చుకొన్న ఆమెకు ఉగ్రవాదుల బెదిరింపులు,తోటి విద్యార్థులు సూటిపోటి మాటలు వేధించారు. అవన్ని సహించి ఇప్పుడు ఇంటర్మిడియట్ చదువుతోంది. ఐపీఎస్ తన లక్ష్యం అని చెపుతోంది ధైర్యశాలి.