వికలాంగుల హక్కుల గేయం  

టైమ్ నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ 2020 బిబిసి 100 మంది ఉమెన్ ఆఫ్ 2020లో జాబితాలో చోటు చేసుకుంది మానసి గిరీష్ చంద్ర జోషి.సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న మానసి ఒక ప్రమాదంలో కాలు పోగొట్టుకుంది ఆమెకు ప్రోసైటిక్  కాలు  అమర్చారు.  శరీరం మళ్లీ మామూలు స్థితికి రావడం కోసం బ్యాడ్మింటన్ ఆడటం మొదలు పెట్టి 2015లో పారా బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ పోటీలలో పతకం సాధించింది. 2019లో స్విజర్లాండ్ లో జరిగిన పోటీల్లో  స్వర్ణం సాధించింది. వరల్డ్ ఛాంపియన్ గా నిలిచింది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ర్యాంకింగ్స్ లో  SL3 సింగిల్స్ విభాగంలో వరల్డ్ నెంబర్ 2 స్థానానికి చేరుకుంది వికలాంగుల హక్కుల కోసం కూడా పోరాడుతుంది మానసి.