చనుబాలు దానం

సాండ్ కి ఆంఖ్ సినిమా ప్రొడ్యూసర్ నిధి పర్మార్ హిరానందాని ఇటీవలే తల్లి అయ్యారు తన చనుబాలు తన బిడ్డకే కాకుండా ఒక ఆస్పత్రికి దానం ఇచ్చి వార్తల్లో నిలిచారు. మొత్తం 42 లీటర్ల పాలు దానం చేశారామె. ఎందరో శిశువులకు తల్లి పాలు తాగే అదృష్టం ఉండదు. అలాటి అనాధ శిశువు గురించి ఆలోంచించి ఆస్పత్రి వర్గాలతో సంప్రదించి ఎన్నో జాగ్రత్తలు తీసుకొని చనుబాలు దానం చేసింది నిధి పర్మార్. ఆమె పంపిన పాలు ఆస్పత్రిలో 60 మంది శిశువులకు పట్టటం ఆస్పత్రి వర్గాలు ఆమెను పిలిచి మరీ చూపించారట ఆ 60 మంది పిల్లలను చూసి నిధి ఉపొంగిపోయిందట.