ఇంటర్నెట్ జీవితంలో ఒక భాగం అయ్యాక సైబర్ నేరాలు సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. కనుక సోషల్ నెట్ వర్క్ లో యాక్టివ్ గా ఉండేవాళ్ళు తమ వ్యక్తిగత సమాచారం అసలు పంచుకోకుండా వుంటేనే మంచిది. ఇంటి చిరునామ ఫోన్ నెంబర్స్,ఫోటోలు పెట్టకూడదు. ఇ-మెయిల్స్ లో పర్సనల్ డాకుమెంట్లు వాటికీ సంబందించిన సమాచారం అసలు పొందు పరచవద్దు. అలాగే బయట నుంచి తెలియని వ్యక్తులు,ఏ బ్యాంక్ నుంచో ఫోన్ చేస్తున్నామని చెపుతూ ఆధార్ కార్డ్ నంబర్,సివీవీ ఓటిపి అడిగితే వెంటనే అలర్ట్ అవ్వాలి. బ్యాంక్ సిబ్బంది ఎప్పుడు ఇలాటి వివరాలు అడగరు.

Leave a comment