దుస్తులకో అవార్డ్  

2015 లో మామ్జ్.కామ్ అనే కామర్స్ వెబ్ సైట్ ని ప్రారంభించారు ఇద్దరు స్నేహితులు కృతి బవేజా దివ్య గుప్తా గర్భిణీలు బాలింతలు ధరించే దుస్తులు సౌకర్యంగా అందంగా స్టైల్ గా ఉండేలా రూపొందించారు. పసి పిల్లలు ఏ ఇబ్బంది లేకుండా పాలు తాగే లా ఉంటాయి. బాలింతల కోసం రూపొందించిన దుస్తులు. అలాగే పసి పిల్లల కోసం కటింగ్ బోత్తాములు పైకి కనబడకుండా మెత్తనివి ప్రత్యేకంగా రూపొందించారు. అలాగే ఆస్పత్రి గౌన్లు, బాటమ్ లు , నర్సింగ్ స్టాల్స్, నర్సింగ్ బ్రా, డ్రైపర్ బ్యాగ్ లు స్విమ్ వేర్ వంటి దుస్తులు ఈ సైట్ లో అమ్ముతున్నారు. రెండేళ్ల క్రితం జాతీయ సంస్థ ఎమ్.ఎస్.డి.ఈ నుంచి జాతీయ ఉత్తమ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవార్డ్ అందుకున్నారు. నెలకు 50 వేల మంది తల్లులు ఈ సైట్ చూస్తారు.