దృష్టి మార్చుకున్నా

హిమాలయాలకు కుదిరినప్పుడల్లా వెళ్తున్నాను. అక్కడ పర్వత సౌందర్యంతో పులకరించి పోతున్నాను. ఆద్యాత్మిక భావన కలుగుతుంది. నా జీవితాన్ని హిమలయాలు మార్చేశాయి అంటుంది అమలాపాల్. సినిమా విషయంలో ఆమె దృక్పదం మారింది. హీరోలతో సమానంగా యాక్షన్ సీన్స్ చేసేస్తుంది.ఆమె ముఖ్యపాత్రలో నటిస్తున్న ‘అదిగో ఆ పక్షిలా’ యాక్షన్ మూవీ పూర్తిగా అడవుల్లో షూటింగ్ జరగనుంది. ఇంకో లేడీ ఓరియెంటేడ్ మూవీ ‘ఆడై’ దర్శకుడు రత్నకుమార్ తీస్తున్నాడు. ఆడై ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా బోల్డ్ గా ఉందని విమర్షలు వచ్చినా సినిమా చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని టాక్ వచ్చింది.ఇప్పుడు సినిమా భారం మొత్తం భుజాల పైకి తీసుకునే లేడీ ఓరియెంటెడ్ సినిమాలకే చాలమంది హీరోయిన్స్ మొగ్గు చూపిస్తున్నారు.