కొంచెం ఖరీదే అయినా విలువైన చీరెలన్ని డ్రై క్లీనింగ్ కే ఇవ్వడం బెస్ట్. పెళ్ళిళ్ళకి, పేరంటాలకు ముఖ్యమైన ఫంక్షన్లకు కట్టుకుని విలువైన చీరెలకు నీటిలో తడిపితే ఆ షైనింగ్‌ పోతుంది. డ్రై క్లీనింగ్ లో దుస్తులను నీటికి బదులుగా ద్రవకాలతో శుభ్రం చేస్తారు. ఇందులో వాడే ద్రావణాలన్ని క్రూడ్ ఆయిల్ నుంచి తయారు చేసినవే. పెట్రోల్, బెంజిన్ ఉపయోగిస్తారు. దుస్తులను పెట్రోల్ లో శుభ్రం చేసి డ్రై క్లీనింగ్‌ మిషన్ లో వేస్తారు. అందులో కార్భన్ టెట్రాక్లోరైడ్, ట్రై క్లోరో ఎథిలిన్ అనే రసాయనాలు కలుపుతారు. ఓ అరగంట తర్వాత తీసి శుభ్రమైన ద్రావణంలో ముంచి తీసి దుస్తులను చుడితే ద్రావకాలు ఆరిపోతాయి. అప్పుడు వేడిగాలిలో ఆవిరైపోతాయి. దుస్తులు పరిశుభ్రంగా ఉంటాయి.

Leave a comment