గోళ్లపై పూరేకలు

పువ్వుల అందాలను గోళ్ళ మీదకు తీసుకు వచ్చే డ్రై ఫ్లవర్ జెల్ నెయిల్ జెల్ మార్కెట్ లోకి వచ్చింది.ఇది పువ్వులు రేకులు అన్నీ కలిపిన జెల్ లాగానే విడిగా గాని దొరుకుతుంది.పూల జెల్ రంగుని గోళ్లకు వేసుకుని కాసేపు ఆరనిస్తే చాలు. అలా కాకుండా ఎండు పూల కిట్ కొనుక్కుంటే ముందుగా పారదర్శకమైన రంగు గోళ్లకు వేసుకుని పువ్వును గోరు పైన అమర్చి మరో కోట్ వేసుకోవాలి. గోళ్ల పైన చక్కని పువ్వు ప్రత్యక్షం అవుతోంది.నెయిల్ ఆర్ట్ ఇష్టపడే అమ్మాయిలు సరదా తీర్చే నెయిల్ జెల్ ఇది.