నిజాయితీగా చెప్పాలంటే పరిశ్రమలో నాకు చెడ్డట్రీట్ మెంట్ ఎదురవలేదు. కానీ చెడ్డ వ్యక్తులు చెడ్డగా ప్రవర్తించటం అన్నది ఇక్కడే కాదు ఎక్కడైనా ఉంటుంది అంటోంది నిత్యామీనన్.జర్నలిజంలో గ్రాడ్యుయేషన్ చేసి చిత్రసీమలోకి వచ్చి చక్కగా నటిస్తూ ,పాటలు పాడుతూ డబ్బింగ్ చెపుతూ ,సినిమాలో తన పాత్ర ఎంత అన్న దానితో నిమిత్తం లేకుండా తన పని చేసుకుపోయే నిత్యా మీనన్ తన చిత్ర పరిశ్రమల మధ్య వ్యత్యాసాలు చూడను అంటుంది. ఏ భాషలో నటించినా నా వరకు స్క్రిప్ట్ మూరుతోంది కానీ మిగతా తేడాలు లేవు. స్క్రిప్ట్ చదువుకొని పాత్ర గురించి తెలుసుకొని నా వరకు నేను ఎంత సృజనాత్మాకంగా ఉండగలనో అంతే చేస్తాను. వాటిపైనే నా ఏకాగ్రత ఉంటే నటిగా విభిన్నపాత్రలు చేయాలని ఉంటుంది అది నాకు నచ్చాలి,అప్పుడే నాకు పూర్తి సంతృప్తికరమంటోంది నిత్యామీనన్.

Leave a comment