చలికాలంలో పెట్రోలియం జెల్లితో ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. దీన్ని పెదవులు పగల కుండా తేమగా ఉంచటం కోసం చర్మానికి మాయిశ్చరైజర్ గా నూ వాడుతూ ఉంటారు. దీన్ని ఐబ్రో జెల్ గా వాడచ్చు. కనుబొమ్మలు పెరగాలంటే పెట్రోలియం జెల్లీ రోజూ రాయలి. ఇది చర్మానికి స్వాంతన పురుస్తుంది. పగిలిన పాదాలకు పొడిబారినా చేతులకు మోకాళ్ళకు రాయవచ్చు. రోజూ నిద్రపోయే ముందర ఇలా చేస్తే చర్మం తేమగా ఉంటుంది. కొందరికి గోళ్ళు తరుచుగా పెలుసుగా అయి విరిగిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే వాటిని పెట్రోలియం జెల్లి రాసి మెల్లగా మర్ధన చేయాలి. ఈ జెల్లీతో మేకప్ తొలగించటం సులువు .దూది ఉండదు జెల్లీలో ముంచి ముఖంపై మేకప్ తొలిగించవచ్చు.

Leave a comment