సినిమాలతో పాటు రెస్టారెంట్ బిజినెస్ నడుస్తోంది.నన్ను బాపు బోమ్మ అని పిలిచే పాటి గుర్తింపు ఉంది. పైగా వెంట వెంటనే సినిమాలు చేయాలని నాకే కోరిక లేదు ,మిగతా పన్లో ఉన్నాను కదా అంటోంది ప్రణీత .తొమ్మిదేళ్ళ క్రితం సినిమాల్లోకి వచ్చిన ఇప్పటీకీ సరైనా గుర్తింపు రాలేదని అడిగిన ప్రశ్నను కొట్టిపారేసింది ప్రణీత. వరసపెట్టి సినిమాలు చేస్తేనే గుర్తింపు వస్తుందా? అంటోంది, పైగా తన ఉద్దేశ్యంలో ముందు చదువుకొని ఆ తర్వాత ఎంచుకొన్న రంగాల్లో కాలు పెడితే అది సినిమా రంగం అయినా ,ఏ రంగమైన, కోరుకొన్న రంగంలో రాణించ లేక పోతే చదువు ద్వారా మరో రంగంలో స్థిరపడవచ్చు. నా మాటుకు నాకు సినిమాలు ఇష్టం బిజినెస్ కూడా. నేను బిజినెస్ స్టార్ట్ చేసి వ్యాపారం బాగా పుంజుకొన్న తర్వాత సినిమాల్లోకి వచ్చాను. తర్వాత సినిమాల్లో బిజీ అయ్యాను .మనకంటూ గమ్యం అంటూ ఉంటే ఎక్కడో ఒక చోట మన సక్సెస్ ఉంటుంది అంటుంది ప్రణీత.

Leave a comment