ఇవి చల్లని రోజులు కాబట్టి ఈ సీజన్ లో లెదర్ ప్యాంట్లు, టాప్ లు కూడా ఉంచుకొండి అంటున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. లెదర్ జాకెట్ ,లెదర్ ఫ్యాంట్లు,బూట్లు ఏదో ఒకటి రెగ్యూలర్ డ్రెస్ లతో పాటు కలిసి వేసుకోవచ్చు. లెదర్ దుస్తులు దాదాపు ఫిట్ గా ఉంటాయి. కనుక భారీ పర్సనాలిటీ గల వారికి లెగ్గింగ్స్ బావుండవు డ్రెస్ లు కూడా అంత బావుండవు లెదర్ జాకెట్లు ఎలాంటి ఆకృతితో ఉన్న బావుంటాయి. లెదర్ బొట్స్ యాంకిల్ లెంగ్త్,నీ లెంగ్త్ ,థైహైలరీ దాకా ఉంటాయి కనుక. వీటిని ఇష్టాన్ని బట్టి ఎంచుకోవచ్చు.వీటిని ప్లాస్టిక్ బ్యాగ్స్ లో పెట్టకూడదు. కాటన్ షీట్స్ లో చుట్టి ఉంచితే గాలి చక్కగా అంది మన్నికగా ఉంటాయి.

Leave a comment