నిద్ర పట్టక పోవటం ఇప్పుడు ప్రపంచ వ్యాప్త సమస్య. దీనికి పరిష్కారాల గురించి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడోక ,స్వాంతన ప్రక్రియ నిద్ర పట్టేలా చేస్తుందని కొత్త పరిశోధన ఒకటి చెపుతుంది. ఉదయం నుంచి పడిన శ్రమను ,అలసటను బెడ్ రూమ్ లోకి తీసుకెళ్ళవద్దని రక్త ప్రసరణ సరిగా ఉండేట్టు చిన్నపాటి వ్యాయామం చేయమంటున్నారు. రాత్రి 11 గంటలకు శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి. రక్త ప్రసరణ వ్యవస్థను విశ్రాంతిగా నిద్రించేలా చేసుకోవాలి. పాదాలతో మొదలు పెట్టి మెదడు వరకు ఒక్కో కండరాన్ని పది సెకండ్ల పాటు పట్టి ఉంచాలి. దీనివల్ల రక్త పోటు నెమ్మదిస్తుంది. దీనితో వెంటనే గాఢ నిద్ర పడుతుందని చెపుతున్నారు పరిశోధకులు. ఇక మరుసటి ఉదయం మళ్ళీ జీవవాహాకలు ఉత్సహాంగా శరీరంలోని రక్తాన్ని పంపిస్తాయి.

Leave a comment