వంటగది దగ్గర చిన్న జాగా ఉన్న ట్రే గార్డెన్ లో పెంచుకోవచ్చు.ట్రే గార్డెన్ కోసం ప్రత్యేకంగా అడుగున చిల్లులు ఉన్నా ట్రే దొరుకుతాయి.వాటిలో సారవంతమైన మట్టి నింపి వాటిలో ధనియాలు, మెంతులు చల్లాలి ఇవి నాలుగైదు రోజుల లోపే మొలకలు వస్తాయి. వారం పది రోజుల్లో  చిన్న ఆకులు వస్తాయి దశలవారీగా రెండు ట్రే లలో గింజలు చల్లి రెండు రోజులకోసారి తాజా కొత్తిమీర మెంతికూర వాడుకోవచ్చు.అలాగే ట్రే లో టమోటో  మిర్చి వంటి గింజలు చల్లి మొలకలు వచ్చే వరకు నీళ్లు చల్లాలి మరి కొన్ని ట్రే లలో మట్టిపోసి మొలకలు పెద్దయ్యాక ఆ నారు పలచగా నాటుకుంటే నెల రోజుల్లో ఫలవంతం అవుతాయి. కొత్తిమీర ఇంటీరియర్ డెకరేషన్ కోసం వాడే హ్యాంగింగ్స్ పాట్స్ లో పెంచుకోవచ్చు.

Leave a comment