ఎటువైపు చూసినా ఇసుక గుట్టలు, ఎండమావులు, ఒంటెలు ఇవే ఎడారి  దృశ్యాలు కానీ చిలీ లోని అటకామా ఎడారి కి వెళ్తే మాత్రం భూమి మొత్తం విచ్చుకొన్న పూలతో ఎంతో రమణీయంగా కనిపిస్తుంది.ప్రపంచంలో అత్యధిక పొడి వాతావరణం నమోదయ్యే ఈ ఎడారిలో వర్షపాతం చాలా తక్కువ. అలాంటిది సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో మాత్రం నీటి అవసరం అంతగా ఉండని ఎడారి మొక్కలు మొలిచి వికసిస్తాయి.కొన్నాళ్లకు ఈ పూలు విడిపోయి ఆ నేలలో విత్తనాలు పడిపోతాయి.మళ్లీ వర్షాలు పడగానే ఆ విత్తనాలు మొలకెత్తుతాయి.ఎడారి పూలు దుప్పటి కప్పుకున్నట్లు కళకళలాడుతాయి.

Leave a comment