కలబంద జ్యూస్ గా తాగినా, మెరుపు కోసం జుట్టు పట్టించినా ఇటు అందానికి ఆరోగ్యానికి దివ్యమైన ఔషదం లాంటిది. ఇప్పుడు కలబంద ఉపయోగాలు తెలిసాక, ప్రతి ఇంటి కుండీలో ఒక కలబంద మొక్క కనిపిస్తుంది. రెండు స్పూన్ల కలబంద గుజ్జు, కొంచెం బిజీ, కీర దోసకాయల గుజ్జు, గింజలు తీసిన ఖర్జూరాల గుజ్జు, నిమ్మరసం, పసుపు కలిపి మొహానికి పట్టిస్తే ఒక చక్కని ఫేస్ మాస్కలా పనిచేస్తుంది. పావు గంట తర్వాత చల్లనీళ్ళతో కడిగేస్తే చాలు ముఖం మెరిసి పోతు వుంటుంద. రెండు కలబంద ఆకులూ నీళ్ళలో ఉడికించి దాన్ని మెత్తగా గుజ్జులా చిదిమి అందులో గంధం పొడి తేనె కలిపి మొహానికి పట్టిస్తే ఎలాంటి జిడ్డు చర్మం అయినా చక్కగా మెరుపులతో వుంటుంది.

Leave a comment