పప్పు, కూర, పచ్చడి ఏది చేసినా బ్రహ్మాండంగా వుంటుందీ, అలా ఊరికే తినేయకండి బీరకాయని కాస్త ముదరనిచ్చి ఆ పీచుతో కనుక ఒళ్ళు రుద్దుకుంటే ఒంటిపైన మృతకణాలను క్షణాల్లో తొలగించి చర్మాన్ని మృదువుగా చేస్తుంది అంటున్నారు అందాల నిపుణులు. చర్మ కణాల్లో రక్త ప్రసరణ మెరుగయ్యేలా చేయటంతో పాటు స్వేద రంధ్రాన్ని తెరుచుకునేలా చేసి వ్యర్ధ పదార్ధాలని తొలగిస్తుందని చెప్తున్నారు. బీరకాయలోని పీచు బాలింతల్లో క్షీర గ్రంధులను తెరుచుకునేలా చేసి పాలు ఫ్రీ గా వచ్చేలా చేస్తుందనే కారణంతో బీరకాయ కూర తినమంటారు ఆయుర్వేద డాక్టర్లు. బీర రసాన్ని బ్యూటీ వాటర్ అంటారు. బీరకాయలోని లిగ్మస్, సిట్రులిన్ వంటి పదార్ధాలు బి1, సి వితమిన్లతో కలిసి చర్మ సౌందర్యాన్ని పెంపొందిస్తాయి, మచ్చలని తొలగిస్తాయి. ఈ పీచుతో సంచులు, చెప్పులూ, దిళ్ళూ, సబ్బులు, లోషన్లు, సౌందర్య లేపనాలు తయారు చేస్తున్నారు.

Leave a comment