Categories
Nemalika

ఈ భావాన్ని వదిలించుకుంటే మేలు.

నీహారిక,

తల్లిదండ్రులతో మంచి అనుభంధం, దగ్గరితనం లేకుండా పెరిగితే ఆత్మనూన్యతాభావం ఏర్పడుతోందంటున్నారు ఎక్స్ పర్ట్స్. లేదా చిన్న వయస్సులో స్కూల్లో ఎవరి ఆధిపత్యం, బెదిరింపులున్న రాను రాను ఈ భావం బలపడుతోందంటున్నారు. సాధారణంగా మన జీవితంలో ఎదురయ్యే కష్ట, నష్టాలకు కూడా మనస్సులో ఆత్మనూన్యతాభావంఏర్పడుతోందంట. చిన్నతనంలో తల్లి దండ్రులు తరచూ విమర్శిస్తున్నారు. ఇతరులతో పోలుస్తూనే ఇటువంటి భావాలు వస్తాయి. దీర్ఘ కాలికంగా ఈ భావాలు వదలకుండా వెంటాడుతుంటే మూడ్ స్వింగ్స్ అసంతృప్తి ఏర్పడుతోంది. సహజంగా శరీరం, మనసు ఒక దానితో ఒకటి ముడి పడి ఉంటుంది. మనసులో నెగటివ్ ఫీలింగ్స్ ముదిరిన కొద్దీ  శారీరక వ్యవస్థ అన్నీ విధాలా ప్రభావితం అయి ఆటో ఇమ్యూన్ రియాక్షన్లు ఎదురవుతాయి. అందుకే ఈ ఆత్మ నూన్యత కారణాలు ఏవైనా, వాటిని వదిలించు కొనే ప్రయత్నాలు చేయాలి. మనస్సులో అదుపులో పెట్టుకోవాలి.

Leave a comment