టెక్నాలజీ పరంగా, ఆధునికంగానూ మనం ఎంత ముందుకు వెళ్ళినా ఈ ప్రపంచం మటుగు స్త్రీల కోసం డిజైన్ చేసినట్లు వుండదు. కనీస సౌకర్యాలు దాదాపు లేనట్లే. ఈ విషయంలో సినిమా దేవతలైనా మినహాయింపు కాదు. శ్రీయా తన అనుభవం గురించి చెప్పుతూ, మేం సకల సౌకర్యాలు అనుభవించడం అనేది ఏదీ నిజం కాదు. షూటింగ్ సమయంలో ఎన్నో ఇబ్బందులు ఒక సినిమా షూటింగ్ సమయంలో నేను వాష్ రూమ్ కి వెళ్ళాలంటే కనీసం వంద మెట్లు ఎక్కి దిగీ, ఎంతో దూరం నడిచి వెళ్ళాను. ఇప్పుడు ఇలాంటి ఇబ్బంది ఎదో ఒక్కటి ఎదురవ్వుతునే వుంటుంది. నేనందుకే షూటింగ్ సమయంలో నీళ్ళు ఎక్కువ తాగాను. ఊరికే దాహం తీర్చుకునేందు నోరు తడుపు కుంటానని చెప్పింది. ఇదే ఇబ్బంది డ్యూటీ లో వుండే లేడీ కండెక్టర్లు, ట్రాఫిక్ లో పని చేసే కానిస్టేబుల్ స్ధాయి ఆడవాళ్ళు ఎదుర్కుంటారు. వాళ్ళు ఇలాగే హయిగా కడుపు నిండా తిని దాహం తీర్చుకునే సాహసం చేయరు. వాష్ రూమ్ ప్రాబ్లమేగా?

Leave a comment