పర్యావరణానికి మేలు చేసే వస్తువులు కనిపెడుతున్నారు చాలా మంది ఇప్పుడు కేరళ లోని ఎర్నాకుళానికి చెందిన లక్ష్మి మీనన్ మొలకెత్తే కలాల్ని కనిపెట్టారు. హోం సైన్స్ లో ఎట్లా తీసుకున్నా లక్ష్మి న్యూ యార్క్ ఫ్యాషన్ వీక్ మోడళ్ళకు నగలు డిజైన్ చేసే వారు. ఆమె అనాధ పిల్లల కోసం తరగతులు నిర్వహించే వారు. వాళ్ళకు కాగితాన్ని బట్టి తాయారు చేసే పెన్నుల తయారీ నేర్పించారు. వాటిని సాన్ఫ్రాన్సిస్కో గ్యలరీ లో ప్రదర్శిస్తే అమ్ముడు పోయాయి. లక్ష్మి నీటి లో విత్తనాలు వుంచి తాయారు చేస్తే అవి అవి పూర్తి స్థాయిలో పర్యావరణానికి మేలు చేస్తాయని ఆలోచించారు. అలా ప్యూర్ లివింగ్ సంస్థ స్థాపించి అందులో రోలాపేనా పేరు తో ఈ వాడి నేలలో పాతితే మొలకెత్తే పెన్స్ తాయారు చేసి వాటిని కళాశాలకు విక్రయించారు. ఈ పెన్ను ఆలోచన బిగ్బీ అమితాబ్ కి నచ్చి బిబిసి కార్యక్రమాల్లో ప్రసారం అయిందిట. ఈ మొలిచే కాగితం పెన్నుల గురించి ఓ సారి ఆలోచించండి. ఇంకా కొత్తగా ఎం చేయొచ్చు?

Leave a comment