నీహారికా,

బందువుల రాకపోకలు, కలిసి నాలుగు రోజులు గడపటం వారంతం లో సరదాగా భోజనాలు చేయటం అన్నీ మంచివే. ఎంతో బావుంటాయి. వారం మొత్తం పని చేసిన అలసట నుంచి విముక్తి కూడా. కానీ వ్యక్తి గతమైన అంశాల విషయం లో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఆరాతీస్తారు. అప్పుడు ఈ బందుత్వాలు, స్నేహాలు వద్దనిపిస్తుంది. అధిక వ్యక్తిగత విషయాలు వస్తే అవి అస్సలు వినిపించుకోకుండా ఇతర అంశాలపైకి సంబాషణ మల్లించాలి. లేదా మరీ ఒక్కళ్ళు ఇద్దరే ఉండి తరచు అడుగుతుంటే  వదిలేయమని మృదువుగానే అడగాలి. ఇవి చాలా మృదువుగా, బంధువులను తెంపేసెలా ఉండకుండా చెప్పాలి. లేదా నాలుగైదు సార్లు ఆ ప్రశ్నలు వెంటనే ఎవాయిడ్ చేస్తూ దారి మళ్లిస్తే అవతల వాళ్ళు ఇక అడగటం మానేస్తారు. దీన్ని హండిల్ చేయాలి. పరస్పర సంబందాలు కాపాడుకొనే బాద్యత ఇరువైపులా ఉండాలి. ఏమంటావ్ .

Leave a comment