Categories
WhatsApp

ఈ విటమిన్లు శరీరానికి అందుతున్నాయా?

శరీరానికి పోషణ కోసం ఎన్నో విటమిన్లు కావాలి. ప్రతి రోజు మనం తీసుకునే ఆహారంలోనే విటమిన్లు ఉంటాయి. కొన్ని విటమిన్లు శరీరానికి ప్రతి రోజు అందాలి. ఈ కాలం చల్లగా వుండే వాతావరణంలో చర్మం దురదలు రాకుండా పొడిబారకుండా ఉండాలంటే విటమిన్ Be శరీరానికి కావాలి. బ్రోకలి, క్యారెట్, లివర్, చేపలు. చిలకడ దుంపలు, ఆప్రికట్స్,  ఫ్యాట్ మిల్క్ లో Be లభిస్తుంది. అలాగే విటమిన్ సి, ఇ లు కోలాజెన్ పెంచి చర్మం మృదువుగా ఉండేందుకు పొగ కాలుష్యం బారి నుంచి చర్మాన్ని రక్షించేందుకుఉపకరిస్తాయి. మొలకలు, కాలిఫ్లవర్, నిమ్మ స్ట్రాబెర్రీ, బొప్పాయి, క్యాబేజీ, బెల్ పెప్పర్లు, బ్రోకలి, టోమాటో, అనాస, ద్రక్షల్లో సమృద్దిగా లాభిస్తాయి. పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు, పాలకూర, ఆలివ్ ఆయిల్, బొప్పాయిలో విటమిన్ ఇ లు లభిస్తుంది. ద్రాక్ష, కివి, తోటకూర, పలకురాల్లో వుండే విటమిన్ కె కాళ్ళకింద వలయాలు మాయం చేస్తుంది. ఏ పదార్ధంలో ఏ విటమిన్ దొరుకుతుందో న్యుట్రీషనిస్ట్ సాయంతో డైట్ చార్ట్ వేసుకుని మరీ తీసుకోవాలి.

Leave a comment