ఇలా ఇచ్చేస్తారు

ఈ ప్రపంచంలో నిశ్శబ్ధంగా ఎన్నేన్నో గొప్ప విషయాలు జరుగుతాయి. చుట్టు ఉన్న మనుషుల్లో ఎన్నో కష్టాలు ,పేదరికం ,వాటిని పరిష్కరించేందుకు ప్రపంచంలోని కొందరు ధనికులు వాళ్ల కుటుంబాలు ఒక ప్రతిజ్ఞ తీసుకొన్నాయి. అలా సేవా చేసేందుకు దీక్ష తీసుకోవటాన్ని గివింగ్ ప్లెడ్జ్ అని పేరు పెట్టారు. ఈ కార్యక్రమం రూపకల్పన చేసేందుకు ప్రపంచంలోని కుబేరులు అనేక దఫాలు సమావేశమై చివరకు ఈ గివింగ్ ఫ్లెడ్జ్ ప్రకటన చేశారు. 2018కి 184 మంది బిలియనీర్లు ప్రతిజ్ఞ తీసుకొన్నారు.365 బిలియన్లు సొమ్ము సమకూర్చారు. ఇంత డబ్బు ప్రత్యేకంగా ఫలానా కార్యకర్యమం కోసం అంటూ కేటాయించకుండా ప్రతి సంవత్సరం ఎన్నో పనులు జరుగుతాయి.ఇందులో మెంబర్లు ఎవరో తెలుసుకోవాలంటే వెబ్ సైట్ లో చూడవచ్చు .