ఏనుగుల పాఠశాల

చిన్న పిల్లలకే నా స్కూళ్ళు ? ఏనుగులకు కూడా ఒక పాఠశాల ఉంది ఎక్కడో కాదు కేరళలో ఏనుగుల స్కూల్ ఏంటి ?అంటే కేరళలో ఏనుగుల సంఖ్య ఎక్కువే .అక్కడి వివిధ ఆలయాల్లో ఏనుగులను పోషిస్తారు దేవుడికి కానుకగా ఏనుగులను సమర్పించే ఆచారం కేరళ లో ఉంది కొడనాడ లో ఉన్న ఏనుగుల శిక్షణ కేంద్రం దక్షిణ భారత దేశంలోనే పెద్దది.దీనికి 80 ఏళ్ల చరిత్ర ఉంది 1951 లో ప్రారంభమైన ఈ శిక్షణా కేంద్రం లో ఏనుగుల కోసం ప్రత్యేకమైన తరగతి గదులు ఉంటాయి.వీటిని చెక్కలతో నిర్మిస్తారు స్థానికంగా వీటిని అనకూడు అంటారు.ఈ అనకూడు లో ఒకేసారి 34 ఏనుగులకు తరగతులు నిర్వహిస్తారు తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ శిక్షణ కేంద్రంలో నిపుణులైన శిక్షకుల ఆధ్వర్యంలో ఏడాది రెండేళ్ళ వయస్సు నుంచే ఏనుగులకు శిక్షణ మొదలవుతుంది.