ఇళ్ళంతా చల్లగా ఉంటే ఒక రకం వాసన వస్తూ ఉంటుంది. తేమగా ఉండేచోట వచ్చే వాసన ఈ సమస్య పోయి ఇల్లు మంచి పరిమళంతో ఉండాలంటే చిన్న చిట్కాలు అవసరం.కాఫీ గింజలను రంధ్రాలున్న గిన్నెలో తీసుకొని మూతపెట్టి ఓ మూలగా పెడితే ఈ గింజలు ఇంట్లో ఉంటే మెతక వాసనని పీల్చుకొంటాయి.మసాలాలు ,మాడిన వాసన వదలకపోతే ,ఆ ఘాటు వాసన ఇల్లంతా వ్యాపిస్తూ ఉంటే వెనిగర్ ని ఒక స్ప్రే సీసాలోకి తీసుకొని వంటింట్లో ,ఇతరుల గదులలో కొడితే వాసన వెంటనే పోతుంది. సాంబ్రానికి పొగ కూడా ఇంట్లో ఏ రకమైన వాసన అయినా పోగోడుతుంది. క్రిమి కీటకాలు దూరం అవుతాయి. మంచి సువాసన కూడా వస్తుంది. కర్పూరపు పరిమళం కూడా ఈగలు ,దోమలని పొగొట్టి ఇల్లు సువాసనతో నింపుతుంది. నాలుగైదు కర్పూరం బిళ్ళలు ఇంట్లో ఒక మూల ఉంచితే సరిపోతుంది.

Leave a comment