టీ.వీలో వచ్చే యాడ్స్ చూస్తూ పిల్లలు ఎనర్జీ డ్రింక్ కోసం అడుగుతూనే ఉంటారు. ముందుగా వాళ్ళకు ఆ బాటిల్ పై రాసి ఉన్న జాగ్రత్తలను చూపించండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. చిన్న పిల్లలకు గర్భిణీలకు మంచివి కావని వాటిపైన చిన్న అక్షరాలతో రాసే ఉంటుంది. వీటిల్లో కేఫిన్ పాళ్ళు చాలా ఎక్కువ .ఎంత ఎక్కువ అంటే ఈ డ్రింక్ ల్లో వాడే ఇన్గ్రారియింట్స్ లో 38.5 mg అని 72 mg అని రాసి ఉంటుంది. వీటి తయారీలో వాడే కృత్రిమమైన స్వీటెనర్స్ శరీరానికి వేగంగా శక్తిని ఇస్తాయి. అలాగే అధిక మోతాదులో క్యాలరీలు కూడా శరీరంలో చేరుతాయి. ఇవన్నీ పిల్లలకు అర్థం అయ్యేలా డెమోఇచ్చి వాళ్ళను తాజా పండ్ల రసాలు ,కూరగాయల రసాలకు మళ్ళించండి.అంటున్నారు డాక్టర్స్.ఈ ఎనర్జీ డ్రింక్స్ లో పోషకాలు ప్రోటీన్స్ ,విటమిన్స్ ఏమీ ఉండవు.

Leave a comment