కూల్ డ్రింక్ కావాలా మజ్జిగ కావాలా అంటే అబ్బే మజ్జిగ వద్దు కూల్ డ్రింక్ అంటారు కానీ ఈ సీజన్ లో మజ్జిగని మించిన పానీయం ఇంకోటి కనిపించదు . చల్లని మజ్జిగలో కరివేపాకులు, పూదీన, అల్లం, జీలకర్ర , తులసి లాంటివి కలిపితే మరిన్నీ ప్రయోజనాలు దక్కుతాయి. శారీరక ఉష్ణోగ్రతను తగ్గించి చలువ చేస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గించగలుగుతుంది. వేసవి తాపాన్ని ,దాహాన్నీ తీర్చగలుగుతుంది. అంతర్గత ఆరోగ్యానికి మాత్రమే కాదు మజ్జిగ చర్మానికి, జుట్టుకు పై పూతగా వాడితే కురులు కాంతిగా నిగారిస్తాయి. ఈ వేసవి ఎండలకు విరుగుడుగా మజ్జిక ఒక్కటే డీహైడ్రేషన్ రాకుండా రక్షించగలుగుతుంది.

Leave a comment