పరిసరాల శుభ్రత ముఖ్యం 

కరోనా వైరస్ భయ పెట్టినా  కొన్ని ఉద్యాగాలకు బయటకు వెళ్ళటం తప్పదు. లేదా అవసరమైన పనిలో ఇతరులతో కలసి పనిచేయటం కూడా తప్పదు. కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలని చెపుతోంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. కనీసం ఒక మీటర్ దూరం పాటించాలి. అనుకోకుండా దగ్గు,తుమ్మ వస్తే మోచేతి మడమతొ మొహం ఆనించాలి. తుంపరలు ఎదుటి వాళ్ళపైకి పోకుండా జాగ్రత్త తీసుకోవాలి. కరోనా,ఫ్లూ,వలే వ్యాపించే వ్యాధి. వర్క్ ప్లేస్ లో టేబుల్స్,కుర్చీలు,ఫోన్స్,అన్ని డెట్టాల్ తో తుడిచి శుభ్రంగా ఉంచుకోవాలి. వ్యక్తిగత శుభ్రత పరిసరాల శుభ్రత పాటించాలి. జ్వరం,దగ్గు,జలుబు లక్షణాలుంటే వెంటనే బయటకు రాకుండా ఇంట్లోనే ఉండాలి.ఇంకా ఇబ్బందులుంటే వెంటనే డాక్టర్ కు కాల్ చేయాలి.