బయోడిజీల్ తయారు చేశారు బయో బీన్ కంపెనీ వాళ్ళు . ముడి పదార్ధం వాడేసిన కాఫీ పొడితో లండన్ లోని బయో బిన్ సంస్థ ఈ జీవ ఇంధనాన్ని తయారు చేసేందుకు కొన్నేళ్ళ క్రితం నుంచి పరిశోధనలు చేస్తున్నారు.ప్రజలు వాడి పారేసిన కాఫీ గింజల నుంచి పదిహేను నుంచి ఇరవై శాతం ఇంధనం తయారు చేయవచ్చు అంటున్నారు బయో బిన్ వ్యవస్థాపకులు.ఇక రాబోయే రోజుల్లో లండన్ రోడ్ల పైకి కాఫీతో తిరిగే బస్ లు రాబోతున్నాయి.చెరుకు,మొక్కజొన్న వ్యర్ధాలతో ఇంధనాన్ని తయారు చేసే దిశగా జరిగిన పరిశోధనల్లో భాగంగా కాఫీ వ్యర్ధాలతో కూడా పరిశోధనలు చేసి ఇప్పుడు ఇంధనం తయారు చేయవచ్చని కనిపెట్టారు. ఖర్చు కూడా కాస్త తక్కువే.విద్యూత్ తో నడిచే వాహనాల్లాగా కాఫీతో నడిచే బస్ లు వస్తాయన్నమాట.

Leave a comment