మనం హోటల్స్ లో, హాస్పటల్స్ లో బాత్ రూమ్స్ లో చేతులు కడుక్కొనే చోట ,చేతులు తుడుచుకోకుండా వాటి కింద చేతులు పెడితే వేడి గాలి వెదజల్లే హాండ్ డ్రయర్స్ చూస్తూ ఉంటాం. పరిశోధనలు ఏం చేబుతున్నాయంటే వీటి మూలంగా సూక్ష్మజీవులు ఇంకా ఎక్కువగా వ్యాప్తి చెందుతాయట. టాయ్ లెట్స్ నుంచి బయటకు రాగానే పక్కనే వాష్ బేసిన్స్ ఉంటాయి. పక్కనే ఈ హాండ్ డ్రయర్స్ ఉంటాయి. మనష్యుల చేతికి అంటుకున్న సూక్ష్మజీవులు ఈ వేడి గాలికి ఎగిరి గాలిలోకి వెళతాయి.వెంటనే ఇంకోకళ్ళని ఆశిస్తాయి.జబ్బులు వ్యాప్తి చెందేందుకు ఇంతకంటే ఏం కారణం కావాలి అంటున్నాయి అధ్యయనాలు.

Leave a comment