రియలిస్టిక్ ఉడ్ స్కిల్ స్పర్స్ చూస్తుంటే చెక్కలో ఇంత అందమైన పూలు,లతలు,పక్షులు,పాములు సాధ్యమేనా అనిపిస్తుంది. ఇదివరకు ఇంట్లో ఒక షోకేస్ అంగిట్లో చక్కని బొమ్మలు హాలుకు అందం ఇచ్చేవి. ఇప్పుడు ఇంటిరియర్ డిజైన్స్ ఆ పద్దతి అవతలపెట్టి మొత్తం హాలు అందాన్ని ఒకే ఒక్క బొమ్మతో అదరగొట్టేస్తున్నారు.ఈ బొమ్మలను ముందుగా చెక్కలో చెక్కి దానికి సహజరూపం ఇచ్చే రంగులో వాటికి ఉండే ఈకలు,పొలుసులు,మచ్చలు ,వెంట్రుకలు అన్నింటికి జాగ్రత్తగా తీర్చిదిద్దుతున్నారు. ఇక పాములున్న చేతికర్రకైతే చూస్తేనే కర్ర పైకి పాము పాకుతున్నట్లు అనిపిస్తుంది. హాల్లో ఒక గ్రీకు శిల్పం ఇప్పుడే అలంకరణకు సిద్దం అవుతున్నట్లు కనిపిస్తుంది.

Leave a comment