ఫైవ్ మినిట్స్ బ్రేక్

రోజు ఇంట్లో ఆఫీస్ లో చేసే పనులే మధ్యలో చిన్ని చిన్ని బ్రేక్స్ తో హుషారు వస్తుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఇంట్లో పనులు చేసుకుంటు మధ్యలో ఐదు నిమిషాలు స్ట్రెచ్చింగ్ ఎక్సర్ సైజ్ చేస్తుండాలి.ఏ పని చేసిన ఈ ఐదు నిమిషాల విరామం మరిచిపోకూడదు. సంగీతం వినటం మంచి స్ట్రెస్ బస్టర్.ముబైల్ ఫోన్లోనో ఐ పాడ్ లోనో నెమ్మదిగా వింటూ చిన్ని చిన్ని పనులు చేసుకోవచ్చు. ఒకే చోట కూర్చోవడం వెన్నుకు మంచిది కాదు, మధ్యలో లేచి ఐదు నిమిషాలు బ్రేక్ ఇవ్వాలి. అలాగే కుదిరితే ధ్యానం, కళ్ళు మూసుకుని సూదీర్ఘంగా శ్వాస తీసుకుని వదులుతూ దాని పైనే ధ్యాస లగ్నం చేయాలి. ఇలంటి బ్రేక్స్ తో ఫలితాలు వేగంగా కనిపిస్తాయి.