Categories
WoW

గర్భిణీలకు తోడుగా గాజు.

ఇది చూసేందుకు మాములు గాజు వంటిదే. ఇందులో ఒక స్పీకర్ వుంటుంది. ఇందులో 80 వరకు గర్భిణి స్త్రీలకు పనికి వచ్చే టిప్స్ రికార్డు చేసి ఉంటాయి. ఎం తినాలి, ఎప్పుడు డాక్టర్ని కలవాలి అన్నది ఈ గాజులో వుండే రికార్డుర్ గర్భిణి స్త్రీలను హెచ్చరిస్తుంది. దక్షిణ ఆసియా దేశాల్లో వివిధ కారణాలతో రోజుకి 830 మంది గర్భిణిలు మరణిస్తున్న నేపధ్యంలో గ్రామీణ ఇంటిల్ సోషల్ బిజినెస్ లిమిటెడ్ వారు ఈ గాజును తయ్యారు చేసారు. ఇది బంగ్లాదేశ్ కు సంబందించిన టెక్ కంపెనీ గర్భిణి పై వాహనాలు, కట్టెల పొయ్యి, పిడకల నుంచి వెలువడే పొగ చుట్టూ ముట్టిన ఈ గాజు వెంటనే హెచ్చరిస్తుంది. గర్భిణిలు దీన్ని ఒకసారి ధరిస్తే కనుక ఎలాంటి రేచార్జ్ అవసరం లేకుండా తొమ్మిది నెలలు పనిచేస్తుంది. గ్రామీణ మహిళలు, కష్టపడి పని చేసే స్ధితిలో ఉన్న వాళ్ళకు ఈ గాజు ఒక వరం. వాళ్ళ భోజనంలో ప్రోటీన్ పాళ్ళు  తగ్గినా, వెంటనే డాక్టర్ను కలిసే అవసరం వున్నా గాజులో స్థానిక భాషల్లో రికార్డు చేసిన వాయిస్ వాళ్ళను హెచ్చరిస్తుంది.

Leave a comment