కర్ణాటకలో గరుడా

ఉగ్రవాదంపై వ్యతిరేక పోరుకు కర్ణాటక రాష్ట్రం ఆల్ ఉమెన్ టీమ్ ని సిద్ధం చేసింది దాని పేరు గరుడ. ఆ రాష్ట్ర సెక్యూరిటీ విభాగం ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సహకారంతో ప్రభుత్వం మొదటి విడతగా 16 మంది అమ్మాయిలతో గరుడా టీమ్ ఎంపిక చేసింది.వీరంతా యాంటీ టెర్రరిస్టు ఆపరేషన్ లో పాలుపంచుకునేందుకు రోజుకి 14 గంటల పాటు శిక్షణ తీసుకుంటున్నారు.శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండేందుకు స్ట్రెస్ మేనేజ్మెంట్ తోనూ తర్ఫీదు తీసుకుంటున్నారు. శిక్షణ అనంతరం వీరంతా యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ లో పాల్గొంటారు .వీరందరికీ మెల్ కమాండోలకు ఇచ్చే శిక్షణ బెంగళూరులో అందిస్తున్నారు.