గీతోపదేశం కథలు

సీనియర్ రచయిత్రి దూర్వాసుల కామేశ్వరీ గారి కథల సంకలనం ఈ గీతోపదేశం పుస్తకం.ఇందులో 17కథలు ఉన్నాయి. ఇవన్నీ స్త్రీల జీవితాలకు సంబంధించిన కథలు.అధిక శాతం మధ్యతరగతి జీవితాలకు ,దిగువ మధ్యతరగతి బతుకులకు సంబంధించినవి. మధ్యతరగతి ప్రజల జీవితాల్లో వస్తున్న మార్పుల, అమెరికాతో ముడిపడుతున్న సంబంధాలు అమ్మాయిల జీవన విధానంలో ఆలోచనల్లో ప్రవర్తనల్లోని వైవిద్యాలు,వైరుద్యాలు వయోధికులైన తల్లిదండ్రుల పట్ల కుటుంబ సభ్యుల ప్రవర్తన ప్రేమ పేరిట మోసపోయినా స్త్రీల అగచాట్లు, మారని మగబుద్ధితో ఇప్పటికీ స్త్రీలపై సాగుతున్న అత్యాచారాలు ఈ కథల్లో తనదైన శైలిలో గొప్పగా చిత్రించారు రచయిత్రి. తప్పని సరిగా ఇవి చదవాల్సిన కథలు…వివరాలకు ఫోన్ నెం: 9247331446