గూడ్స్ బండి నడిపారు

పశ్చిమ రైల్వే కు చెందిన ముగ్గురు మహిళా సిబ్బంది గూడ్స్ బండిని మహారాష్ట్ర నుంచి గుజరాత్ వరకు నడిపారు. లోకో పైలెట్ కుంకుమ్ డోంగ్రే, అసిస్టెంట్ లోకో పైలట్ ఉదితా వర్మ ,గూడ్స్ గార్డ్ ఆకాంక్ష రే, మహారాష్ట్ర వసాయ్ స్టేషన్ నుంచి గుజరాత్ లోని వడోడర వరకు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో నడిపి ఏ పనీ తమ శక్తికి మించినది కాదని నిరూపించారు.