గ్రీన్ టీ గురించి మాట్లాడుకునివుంటాం. ఎన్నో ఉపయోగాలున్నాయని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎప్పుడో సరికొత్త అధ్యయనం వల్ల  ఇంకో కొత్త అంశం ఈ ఉపయోగాల్లోకి వచ్చి చేరింది. గ్రీన్ టీ తాగితే మొటిమలు మాయం అయిపోయాయంటున్నాయి ఈ సరికొత్త అధ్యయనాలు. మరీ ముఖ్యంగా ,ముక్కు గదమ ప్రాంతాల్లోకి మొటిమలు వెంటనే తగ్గిపోతాయట. గ్రీన్ టీ వల్ల  కేసంలోని అంకుర ప్రాంతంలో నూనె స్రవించే గ్రంధుల వద్ద బాక్టీరియా పెరిగేందుకు అనువుగా ఉన్న ప్రాంతంలో సైతం మొటిమలకు కారణమయ్యే బాక్టీరియా అంతగా పెరిగే అవకాశం ఉండదు అంటున్నారు తైవాన్ లోని నేషనల్ యాంగ్ మింగ్ యూనివర్సిటీ పరిశోధకులు గ్రీన్ టీ లోని ఎపిగాలోకే టెచిన్-3 గాల్వేజ్ అనే పోషకం మొటిమల పెరుగుదలకు దోహదం చేసే ప్రాంతంలో బాక్టీరియా పెరగకుండా చేస్తుందిట. దానికి తోడు ఆ పోషకం లోని వాపు మంట తగ్గించే యాంటీ ఇన్ఫలమేటరీ గుణం సైతం మొటిమలు రాకుండా వుండేందుకు  దోహదం చేస్తుందని పరిశోధన ఫలితాలు చెప్తున్నాయి.

Leave a comment