జిమ్ కి వెళ్తున్నారా ?

బరువు తగ్గేందుకు ఆరోగ్యం కోసం జిమ్ కి వెళ్ళడం రైటే. కాని అందుకు సరైన అహారం కూడ తీసుకోవాలి. ఖనిజ లవణాలతో కలిగిన పోషకహారం తిసుకోకపోతే ఆరోగ్యం పైన ప్రభావం చుపిస్తుంది. జిమ్ చేయబోయే ముందు వ్యాయామానికి తగ్గట్లు శక్తినిచ్చేదుకు అధిక ప్రోటిన్లు అధికంగా ఉండే కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారం తీసుకోవాలి. పండ్లు,వేరుశనగ గింజలు ,పెరుగు,చిలకడ దుంపలు ఎక్స్ పర్ట్ సలహాతో తిసుకోవాలి. లేకపోతే తెలియని అలసట కండరాలలో ప్రారంభమై త్వరగ అలసిపోయే సమస్య ఉంది. అలాగే జిమ్ కి వేళ్ళే ముందే మంచి నీళ్ళు తాగాలి.లేకపోతే శరిరంలో నీటి శాతం తగ్గిపోయి డిహైడ్రేషన్ వస్తుంది.