రైల్వేలో తొలి మహిళ ఇన్స్ పెక్షన్ ఇంజనీర్ గా రికార్డుల్లో కి ఎక్కింది కాశిష్ శర్మ ఈ ఇన్స్ పెక్షన్ అంత తేలికైన పని కాదు రైల్వే ట్రాక్ ఏర్పాట్లు పర్యవేక్షించటం సిగ్నల్స్ ఏర్పాటు చేయటం రైలు వెళ్లేప్పుడు సాంకేతిక పరమైన ఇబ్బందులు తలెత్తకుండా చూడటం బ్రిడ్జ్ నిర్మాణంలో కార్మికుల పనితీరును పర్యవేక్షించడం రైల్వే పరికరాల పరిశ్రమలు పర్యవేక్షించడం వంటివి చూసుకోవాలి కొన్ని ప్రాంతాల్లో టాయిలెట్ అందుబాటులో ఉండదు ఉదయం ఏడు గంటలకు మొదలయ్యే పని సాయంత్రానికి పూర్తి కాకపోవచ్చు అయినా అన్నింటినీ  సమర్ధవంతంగా నిర్వహిస్తూ వస్తోంది కాశిష్ ప్రస్తుతం రాజస్థాన్ లోని 98.5 కిలో మీటర్ల పరిధిలో ఉండే తొమిది సైట్లను పర్యవేక్షిస్తోంది కాశిష్ శర్మ .

Leave a comment