కైడీ టెక్నాలజీస్ పేరుతో మోనికా ఝా వినూత్నమైన స్ట్రీట్ లైట్స్ ని తయారు చేస్తోంది. ఐదు సాంప్రదాయ లైట్ల స్థానంలో ఒక్కటి ఏర్పాటు చేస్తే చాలు 160 డిగ్రీల కోణంలో దేదీప్యమానంగా వెలుగు నిస్తాయి. .సెమీ స్మార్ట్‌ ఫీచర్స్‌తో దొంగతనం చేయడానికి వీలు లేకుండా ఉంటాయి. దీని వల్ల బోలెడు విద్యుత్ డబ్బు ఆదా అవుతాయి అంటుంది మోనికా. ఈమె ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లో ఇంజినీరింగ్  పూర్తి చేసింది. ఐదు దీపాల వెలుగు నిచ్చే ఒకే దీపాన్ని తయారుచేసే  ఈఈఎస్‌ఎల్‌ కేంద్ర విద్యుత్‌ శాఖ, వరల్డ్‌బ్యాంక్‌, ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ వంటి సంస్థల నుంచి అవార్డులెన్నో అందుకుందీ.

Leave a comment