ఇంటి పని సులభం

కొన్ని చిన్న టిప్స్ దృష్టిలో ఉంచుకుంటే ఇంటి పని సులువు అవుతోంది.ఇల్లు తుడిచే క్లీనింగ్ లిక్విడ్ తో పాటు కొంచెం ఉప్పు కలిపి నట్లయితే ఇంట్లోకి ఈగలు రావు. పన్నీర్ ని బ్లాటింగ్ పేపర్ లో చుట్టి ఫ్రిజ్ లో పెడితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. నేరుగా ఫ్రిజ్ లోంచి తీసి ఫ్రై చేయకుండా గోరువెచ్చని నీళ్ళలో వేసి తీసి ఫ్రై చేస్తే మెత్తగా తాజాగా ఉంటుంది. బాగా పండిపోయిన టమోటా లోని ఉప్పు వేసిన చన్నీళ్ళలో రాత్రంతా పెడితే మరుసటి రోజుకు తాజాగా అయిపోతాయి. పెరుగు పుల్లగా అయిపోతే పలుచని గుడ్డతో నీళ్లు వడకట్టి కొద్దిగా పాలు కలిపితే తియ్యని పెరుగు సిద్ధంగా ఉంటుంది.