ఎప్పుడూ ఇంటిపని భార్యదే. ఆఫీస్ పని ఉన్న, ఎంతో బిజీ అయినా బాధ్యతలో ఉన్న, కుటుంబం ,పిల్లలు, వంటిల్లు ఎప్పుడూ ఆడవాళ్ళ భుజాలపైనే ఉన్నాయి. ఇప్పుడూ పరిస్థితి మారింది. కొంత మంది మగవాళ్ళు భార్యల కేరీర్ కి వారి ఆశయాలు నెరవేర్చుకొనేందుకు అవకాశం ఇస్తు ఇంటి బాధ్యతలు తీసుకొంటున్నారు. పిల్లల పెంపకం ఇంటి పనులు భర్తే నిర్వహిస్తూ హౌస్ హస్బెండ్ అని సంతోషంగా గుర్తింపు తీసుకొంటున్నారు. ఈ విధంగా ఎప్పటి నుంచో విదేశాల్లో ఉంది. మన దేశానికీ ఇప్పటికిప్పడే ఈ మధ్యనే విస్తరిస్తుంది. కొంత మంది ఉన్నాతోద్యోగం చేస్తున్న భార్య స్థానం పదిలంగా ఉండేలా తమ ఉద్యోగాన్ని వదులుకొని పిల్లల బాధ్యత తీసుకుంటున్నారు. ఈ పనులన్ని చేస్తూ భార్యభర్తల మధ్య ఇగో ప్రాబ్లమ్ రాకుండా కొన్ని కొత్త కోర్సులు కూడా వస్తున్నాయి. బెంగళూరు బతుకు కమ్యూనిటీ కాలేజీ రిజర్వుడ్ ఫర్ మెన్ కోర్స్ ప్రారంభించారు.

Leave a comment