Smile foundation నిర్మించిన అయామ్  కలామ్  నిస్సందేహంగా గొప్ప స్ఫూర్తిదాయక చిత్రం ఎన్నో అవార్డులు గెలుచుకున్న ఈ చిత్రం చోటు అనే బాలుడి కథ. చోటు నీ తల్లి తీసుకువచ్చి ఒక హోటల్ పనిలో వెడుతుంది. రాజస్థాన్ లోని బికనీర్ రాజ వంశస్థులు ఉండే రాజ సౌధానికి దగ్గర్లో ఒక చిన్న టీ కొట్టు లో పనిచేసే చోటు కి కలాం ఆదర్శం చక్కగా చదువుకోవాలని కలలు కంటాడు. రాజకుటుంబానికి చెందిన బాలుడితో స్నేహం ఏర్పడుతుంది రహస్యంగా ఆ సౌధం లోకి అడుగు పెట్టి యువరాజుతో స్నేహంగా ఉంటాడు చోటు అతనికి యువరాజు ఇచ్చిన బహుమతులను చూసి అతన్ని దొంగ గా భావించి కొడతారు పిల్లవాడు పారిపోయి ఢిల్లీలో కలాం ను చూసి చదువు చెప్పించమని  అడగాలనుకొని ఢిల్లీ చేరుతాడు ఈలోగా యువరాజు తండ్రితో జరిగిన సంగతి చెప్పి చోటు తన స్నేహితుడని అతని స్నేహం తో తను ఎంతో సంతోషించాం అని చెబుతాడు. అతన్ని వెతుక్కుంటూ రమ్మని చోటుని యువరాజుతో పాటు చదివిస్తానని అతని తల్లిని తన మహల్ లో పని చేసుకోమని చెబుతాడు. చోటు యువరాజు స్కూల్ కి వెళ్తారు చోటు  వంటి పిల్లలందరికీ చదువుకునే హక్కు గురించి చెబుతుంది సినిమా.
రవిచంద్ర. సి
 7093440630

Leave a comment